జాతీయస్థాయికి ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థిని
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(12)
మద్దూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న గుండె అన్విత జాతీయస్థాయి ఎస్యు జి ఎఫ్ /19 హ్యాండ్ బాల్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ అందె గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో తుక్కుగూడ కేంద్రంలో జరిగినటువంటి పోటీలలో ఉత్తమమైన ప్రతిభను కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని డిసెంబర్ 17 వరకు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పోటీలలో పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా ప్రాంతంలో జరుగుతున్నటువంటి హ్యాండ్ బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడుతున్నట్లు వారు తెలియజేశారు జాతీయస్థాయిలో కూడా రాణించి తెలంగాణ జట్టుకు అదేవిధంగా మన సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంపికైన క్రీడాకారునికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల బృందం అన్వితను, పీడి దామెర ప్రేమ్ కుమార్ గారిని అభినందనలు తెలియజేశారు….