పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
-ఐదు మంది వ్యక్తులు అదుపులోకి
-సంఘటన స్థలం వద్ద 4964 రూపాయల నగదు మరియు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం
తెలంగాణ కెరటం సిద్ధిపేట క్రైమ్ డిసెంబర్ 10:
చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదుసిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోనెపల్లి గ్రామ శివారులో ఉన్న హోటల్లో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, చిన్న కోడూర్ పోలీసులు వెళ్లి రైడ్ చేయగా *05 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4964/- వేల రూపాయలు, 03 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, చిన్నకోడూరు పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు