మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం స్థల పరిశీలన.
– డిఈ శంకర్.
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్ (13)
మద్దూరు మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం డి హౌసింగ్ డిఈ శంకర్, అర్ఐ రమేష్ తో కలిసి మండల కేంద్రంలోని రైతు వేదిక పక్కన బిల్డింగ్ నిర్మాణం కోసం కేటాయించినా స్థలాన్ని పరిశీలన చేశారు.ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గుడూ సరిగా లేని పేదలకు ప్రభుత్వం అందిస్తున్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏ విధంగా ఉండాలో ఈ మోడల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ద్వార లబ్ధిదారులకు తెలియడం కోసమే మొదటిగా మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లును ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.