---Advertisement---

సమాచార హక్కు చట్టం కమీషనర్లను నియమించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జి.వెన్నెల కు వినతి* 

---Advertisement---

*సమాచార హక్కు చట్టం కమీషనర్లను నియమించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జి.వెన్నెల కు వినతి*

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ప్రతినిధి  డిసెంబర్ 8:

హైదరాబాద్ లో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ జి.వెన్నెల గారిని మాదాపూర్ లోని ఆమె కార్యాలయంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చంటి ముదిరాజ్ మరియు జాతీయ,రాష్ట్ర కమిటీ సభ్యులు సమాచార హక్కు చట్టం – 2005 కమిషనర్లను నియమించాలని ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జి.వెన్నెల మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు ఉందన్నారు. అలాగే అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టిఐ కమిషనర్లను నియమించేందుకు కృషి చేస్తా అన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోసం వివిధ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా, 30రోజుల్లోగా ఇవ్వ వలసిన సమాచారాన్ని కొన్ని నెలలు గడిచినా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్ సమాచారం ఇవ్వట్లేదనీ, అలాగే సెక్షన్ 19(3) ప్రకారం రెండవ అప్పీల్ చేస్తే స్టేట్ కమిషన్ ఆఫీస్ లో కమిషనర్లు లేక వేల దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీఐ కమిషనర్లను నియమించాలని, సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్,రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు జి.ప్రియ రెడ్డి,రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి ఎర్రబెల్లి ప్రగతి,గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వింజమూరి గణేష్,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment