---Advertisement---

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే (ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు) పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత.

---Advertisement---

పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే (ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు) పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత.

 

గ్రూప్-2 పరీక్షకు 16 కేంద్రాల్లో 5855 మంది అభ్యర్థులు.

 

జిల్లాలో గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి.

 

అదనపు కలెక్టర్ నగేష్.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 12:

 

జిల్లాలో గ్రూప్ – 2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.

గురు వారం, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో , అడిషనల్ ఎస్పీ మహేందర్ , డిఆర్ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి,నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి,తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, ప్రిన్సిపల్ హుస్సేన్ లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్ లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, డిపార్టుమెంటల్ అధికారులు, లోకల్, జాయింట్ రూట్ అధికారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ (783) గ్రూప్-2 పోస్టులకు గాను నాలుగు పేపర్ల వారీగా ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష, అలాగే 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ – 3 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ – 4 పరీక్ష జరగనుందని తెలిపారు.  జిల్లాలో మొత్తం (5,855) మంది అభ్యర్థులు (16) పరీక్ష కేంద్రాల్లో ఈ గ్రూప్-2 పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. మెదక్-11, నర్సాపూర్ -03,అలాగే చీఫ్ సూపరింటెండెంట్ లు (16), డిపార్ట్మెంటల్ అధికారులు (16), అబ్జర్వర్ లు (16), ఫ్లయింగ్ స్క్వాడ్ లు (5), బయోమెట్రిక్ అధికారులు (44), ఐడెంటిఫికేషన్ అధికారులు (58), ఐదు రూట్లలో 05 లోకల్, జాయింట్ రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. వంద శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష హాల్లో పరీక్ష ప్రారంభానికి ముందే ఓఎంఆర్ షీట్ పై ఇన్విజిలేటర్ లు పరీక్షార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఓఎంఆర్ షీట్ లో అత్యంత జాగ్రత్తగా అభ్యర్థులు వారి వివరాలను కేటాయించిన ఆయా బ్లాకుల్లో తప్పులు లేకుండా నమోదు చేసేలా చూడాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు.

పరీక్ష కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి, మౌలిక వసతులను కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని, ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, సిబ్బంది అందుబాటులో ఉండాలని, పరీక్ష పేపర్లు, ఓఎంఆర్ షీట్ లను పకడ్బందీగా, తగిన జాగ్రత్త చర్యల నడుమ తప్పనిసరిగా ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమయానుకూలంగా వ్యవహరించాలన్నారు.ఇన్విజిలేటర్ లతో సమావేశాలను ఏర్పాటు చేయాలని,సెంటర్ లలో సీసీ కెమెరాల పని తీరును సరిచూసుకోవాలని, అభ్యర్థుల హాల్ టికెట్, గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ కార్డును సరిగా చూడాలని, నిర్దేశించిన రూట్ లలో మాత్రమే ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ పత్రాలను తీసుకొని వెళ్ళాలని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రూట్ అధికారులు, అబ్జర్వర్ లు, ఐడెంటిఫికేషన్ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ మాట్లాడుతూ పరీక్ష సమయానికి B.N.S-160 (భారతీయ న్యాయ సమితి) సెక్షన్ అమల్లో ఉంటుందని,

పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు

అభ్యర్థులకు జిల్లా అదనపు కలెక్టర్ కీలక సూచనలు.

అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు.పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు. డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టు ఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలిపారు.పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించరాదని సూచించారు. పరీక్షార్థులు మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ (లేదా) బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. పరీక్ష సమయ పాలనకు సూచికగా ప్రతీ అర్థగంటకోసారి బెల్ మోగుతుందని తెలిపారు. అదే విధంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.అంతకుముందు బయోమెట్రిక్ విధానంపై అధికారులు, ఇన్విజిలేటర్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9908696575 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించి, వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.ఈ సమీక్ష సమావేశంలో టీజీపీఎస్సీ రూట్ ఆఫీసర్,స్పెషల్ అబ్జర్వర్ శ్రీధర్,డిపిఓ యాదయ్య,,ఇంటర్మీడియట్ ఆఫీసర్ మాధవి,మెప్మా పీడీ ఇందిరా,డిడి ట్రైబల్ వెల్ఫేర్ నీలిమ,పోలీసు శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment