జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి
సమన్వయంతో వ్యవహరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నందు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులకు అందరికీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుండి వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.ఈనెల 17వ తేదీన ప్రారంభించే జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీలను ఉద్దేశించి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.అంతే కాకుండా క్రీడాకారులకు మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులందరూ ఈనెల 17 తేదీన ఉదయం 8:00 గంటలకల్లా హాజరయ్యే విధంగా చూడాలని అన్ని మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు.వ్యాయామ ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణానికి ఉదయం 7:00 గంటలకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాయువజన మరియు క్రీడల అధికారి నాగరాజు,పిడి లు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.