సీఎం హామీ చిత్రంతో సెల్ఫీ దిగుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

సీఎం హామీ చిత్రంతో సెల్ఫీ దిగుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా 21వ రోజు సీఎం గారు హామీ ఇచ్చినటువంటి చిత్రంతో ఫోటోలు దిగుతూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సీఎం హామీని నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ కామారెడ్డి మున్సిపాలిటీ ముందు చౌరస్తాలో మానవహారం చేసి సెల్ఫీ దిగి ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సీఎం హామీని నిలబెట్టకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలుపుతున్నాం. ఇప్పటివరకు 21వ రోజు పూర్తి అయిన ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు లేకపోవడం బాధ కలిగించే విషయం అని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు తెలపడం జరిగింది. ఈరోజు ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతు తెలుపడం జరిగింది వీరితోపాటు ట్రస్మా బాధ్యులు ఆనందరావు, నిస్సి ,ఉపనదుల నాగరాజు గౌడ్, శివరాత్రి యాదగిరి, శరత్చంద్ర మరియు కామారెడ్డి మండల ఉర్దూ మీడియం ఎస్ జి టి ఉపాధ్యాయులు నాయిం ఫాతిమా, హలీమా మేహజాబీన్ మరియు కుర్షిత్ గార్లు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది


ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి,నాయకులు శ్రీధర్, రాములు,కాళిదాసు, శైలజ,సంతోష్ రెడ్డి, వనజ,మంగా, శ్రీవాణి, కళ్యాణ్,సంధ్య,లింగం, కృష్ణ,దినేష్,వీణ, లావణ్య 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment