దుబ్బాక మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన
–దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక:జనవరి13,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక మండలంలోని అప్పనపల్లి, పెద్ద గుండవెల్లి, బల్వంతపూర్, గంభీర్ పూర్, ఆకారం గ్రామాలలో సీసీ రోడ్లు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి కంకణ బదులమై పనిచేస్తున్నామని రాబోయే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోతే దుబ్బాక ఇప్పటికే పది సంవత్సరాలు వెనక పోయిందని ఇంకా వెనుకకు పోతుందని దీనిని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.