కొండపోచమ్మ ప్రాజెక్ట్ లో గల్లంతైన యువకులను బయటికి తీసిన
–జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 11,
హైదరాబాద్ లోని ముషీరాబాద్ పట్టణానికి చెందిన యువకులు కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లే దారిలో కొండపోచమ్మ సాగర్ కట్ట కనబడినందున చూడడానికి వచ్చిన ఏడు మంది యువకులు నీటిలోకి దిగి పొటోలు,వీడియోలు తీసుకుంటుండగా ఏడు మందిలో ఇద్దరు బయట ఉండగా,ఐదు మంది యువకులు నీటిలో మునిగిపోయారు.బయట ఉన్న ఇద్దరు యువకులు అరవడంతో అక్కడ ఉన్న వ్యక్తులు పోలీసులకు సమాచారం అందజేశారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా కమిషనర్ డాక్టర్ అనురాధ సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.ఏడు మంది యువకులలో ఐదు మంది యువకులు నీటిలో పడిపోయారని తెలుసుకున్నారు.జిల్లాలో ఉన్న గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు.వారితో పాటు గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి,గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి,గజ్వేల్ సీఐ ముత్యం రాజు,తొగుట సీఐ లతీఫ్,ములుగు ఎస్ఐ విజయ్ కుమార్,గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి,లు కలసి గజ ఇతగాళ్ల సహాయంతో ఐదు మంది యువకులను బయటికి తీశారు.వారు తెలిపిన వివరాలు జెతిన్ తండ్రి గోపీచంద్ 17 సంవత్సరాలు కైరతాబాద్,సాహిల్ తండ్రి దీపక్ 19 సంవత్సరాలు,చీకట్ల దినేశ్వర్ తండ్రి కిషన్ 17 సంవత్సరాలు బాన్సిలాల్ పేట్,లక్కీ తండ్రి నర్సింగ్ 17 సంవత్సరాలు ముషీరాబాద్,ధనుష్ తండ్రి నర్సింగ్ 20 సంవత్సరాలు ముషీరాబాద్ ఈ ఐదు మంది యువకులు మరణించి ఉన్నారని వారు అన్నారు.ఐదు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కొరకు తరలించారు.ఈ మరణానికి గల కారణాలను పోస్ట్ మార్టం చేయగానే తెలుస్తుందని వారు అన్నారు.ఐదు మంది యువకులు జల్సాల కోసం పోటోలు దిగడం గురించి ప్రాణాలు కోల్పోయారని,వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ కమీషనర్ అనురాధ ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారితో పాటు సిద్దిపేట జిల్లా ఏఆర్ పోలీసులు,గజ ఈతగాళ్లు తదితరులు ఉన్నారు.