యువకుని పై నూతనకల్ పోలీసుల అత్యుత్సాహం
విచక్షణారహితంగా చితకబాది. కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్,ఎస్సై
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా లోని నూతనకల్ మండల పరిధిలోని ఇంటి ముందు నిలుచున్న కటురి రాము వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అంటే మా ఇంటి దగ్గర నిలబడ్డాను అని సమాధానం ఇవ్వడంతో కానిస్టేబుల్లో ఆగ్రహానికి గురై ఆ వ్యక్తిని పోలీస్ జీప్ లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన నూతనకల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట పడడంతో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి జిల్లా ఉన్నతాధికారులకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నట్లు సమాచారం వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్ఐపై చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నాడు. లేకుంటే సూర్యాపేట జిల్లా ఎస్ పి గారిని కలుస్తానాని బాధితుడు , భదితుడి బందువులు వాపోతున్నారు .